నిలకడగా ఆడుతున్న టీమిండియా

నిలకడగా ఆడుతున్న టీమిండియా

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా నిలకడగా ఆడుతుంది. భారత్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడింది. మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్, మూడో బంతిని రోహిత్ శర్మ షాట్ ఆడగా స్కేర్ లెగ్‌లో గాల్లో లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కౌల్టర్ నైల్ గాల్లో డైవ్ చేసి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. ఐతే బంతి అతని చేతికి తాకి వెళ్లిపోవడంతో రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆసీస్ బౌలర్లు కమిన్స్, స్టార్క్ కళ్లుచెదిరే బంతులతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయకుండా కట్టడి చేస్తున్నారు.ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఆచితూచి పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా టీమిండియా 81   పరుగులు సాధించింది. రోహిత్ (32; 46బంతుల్లో, 2 ఫోర్లు), ధవన్(46; 50 బంతుల్లో, 7 ఫోర్లు) క్రీజ్ లో ఉన్నారు.