ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం.. పింక్‌బాల్‌ టెస్ట్‌కు కౌంట్‌డౌన్‌..

ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం.. పింక్‌బాల్‌ టెస్ట్‌కు కౌంట్‌డౌన్‌..

భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టుకు సర్వం సిద్ధమైంది. పింక్‌ బాల్‌ టెస్ట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్... ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. గులాబీ టెస్టు కోసం ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఇండోర్‌ టెస్ట్‌ మూడు రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులు ఫుల్‌ ప్రాక్టీస్‌ చేశాయి. ప్రత్యేకంగా తడిబంతులతో ఇరు జట్ల ఆటగాళ్లు సాధన చేశారు. ఇక, ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో సత్తా చాటాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. 

బంగ్లాదేశ్‌ జట్టుకు ఇదే ఫస్ట్ డే అంట్‌ నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌. ఇండోర్‌లో చిత్తు చిత్తుగా ఓడిన బంగ్లా టీమ్‌ ఈ మ్యాచ్‌లో కనీస పోటీనైనా ఇవ్వాలని భావిస్తోంది. బంగ్లా బ్యాటింగ్‌లో ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్మాదుల్లా, లిటన్‌ దాస్‌ కీలక బ్యాట్స్‌మెన్‌. వీరి రాణింపుపైనే బంగ్లా విజయావకాశాలు ఆధారపడ్డాయి. ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, అబు జాయేద్‌ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. పింక్‌ బాల్‌తో వీరిద్దరూ స్వింగ్‌ రాబడితే టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు తిప్పలు తప్పవు. మరోవైపు టీమిండియా బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. ఓపెనర్‌ మయాంక్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ, రోహిత్‌, పుజారా, రహానే తమ బ్యాట్‌కు పని చెబితే.. బంగ్లా ఆడ్రస్‌ గల్లంతే. ఇక టీమిండియా బౌలింగ్‌ వరల్డ్‌లోనే ది బెస్ట్‌ ఎటాక్‌గా ఉంది. స్పిన్‌, పేస్‌ విభాగాల్లో సమతూకంగా ఉంది. షమీ, ఉమేశ్‌, ఇషాంత్‌ లాంటి పేస్‌ గుర్రాల్ని తట్టుకుని బంగ్లా బ్యాట్స్‌మెన్‌ నిలబడటం కష్టం. ఇండోర్‌ టెస్ట్‌లో పేసర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ చేతులేత్తశారు. స్పిన్‌ విభాగంలో అశ్విన్‌, జడేజా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు.