టి 20 :  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా.. 

టి 20 :  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా.. 

ఇండియా బాంగ్లాదేశ్ జట్లమధ్య మూడు టి 20 మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే.  మొదటి టి 20 మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం అయ్యింది.  ఉదయం నుంచి ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో సాయంత్రం మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.  కానీ, సాయంత్రం వరకు వాతావరణంలో మార్పులు రావడంతో మ్యాచ్ కోసం అంతా సిద్ధం చేశారు.  

కాగా, మొదటి టి 20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  ఈ టి 20 మ్యాచ్ లో అనేక మార్పులు జరిగాయి. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి తీసుకోవడంతో కెప్టెన్ గా రోహిత్ శర్మకు ప్రమోషన్ వచ్చింది.  ఇప్పటి వరకు ఇండియా.. బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు జరిగాయి.. ఈ 8 మ్యాచ్ లలో ఇండియా గెలిచింది.  ఇది తొమ్మిదో మ్యాచ్.  మరి ఎవరు గెలుస్తారో కాసేపట్లోనే తేలిపోతుంది.