కార్తీక్‌కు మరో ఛాన్స్‌ ఇవ్వండి...

కార్తీక్‌కు మరో ఛాన్స్‌ ఇవ్వండి...

టీమిండియా వికెట్ కీపర్ దినేశ్‌ కార్తీక్‌కు మరోక్క ఛాన్స్‌ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ ను మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ కోరారు. తాజాగా గౌతమ్‌ గంభీర్‌ ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ... ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా జరిగే మూడవ టెస్టులో దినేశ్‌ కార్తీక్‌కు తుది జట్టులో చోటు దక్కకపోతే మళ్ళీ అతన్ని మరో టెస్టు జట్టులో చూసే అవకాశం ఉండకపోవచ్చు. యువ రిషబ్‌ పంత్‌కు ఇంకా సమయం ఉంది.. అతను ఇంకొంత కాలం వేచి ఉండాలి. ఎందుకంటే టెస్టుల్లో ఆరంగేట్రం కోసం అతనికి చాల సమయం ఉందన్నారు. కార్తీక్ రెండు టెస్టుల్లో విఫలమయిన నేపథ్యంలో రిషబ్‌ను ఆడించాలని చాలా మంది అనుకుంటున్నారు. అయితే కార్తీక్‌కు మరో అవకాశం ఇవ్వాలి.. అతడు చాలా సంవత్సరాల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చాడని తెలిపారు. కార్తీక్‌కు మరోక్క ఛాన్స్‌ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ ను కోరారు. కార్తీక్ ట్రెంట్‌బ్రిడ్జ్‌లో రాణిస్తాడని గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేసారు.

రెగ్యులర్ టెస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా గాయపడటంతో అతని స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే వచ్చిన అవకశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కార్తీక్‌ విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్ లలో కార్తీక్ స్కోరు 0, 20, 1, 0. దీంతో అతడు మూడో టెస్టులో ఆడే అవకాశం కనిపించడం లేదు. అతని స్థానంలో రిషబ్‌ పంత్‌ ఆడటం దాదాపుగా ఖాయమైంది. మరోవైపు కార్తీక్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌కు చోటివ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు సూచించారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ గంభీర్‌ స్పందించి  దినేశ్‌ కార్తీక్‌కు అండగా నిలిచారు.