వరల్డ్‌కప్‌: సెమీస్‌లో ఎవరితో ఎవరంటే..

వరల్డ్‌కప్‌: సెమీస్‌లో ఎవరితో ఎవరంటే..

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో లీగ్ దశ ముగిసింది... ఇక సెమీఫైనల్‌ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌లే మిగిలిపోయాయి. శనివారం లీగ్‌ దశ మ్యాచ్‌ల్లో ఫలితాలు సెమీ ఫైనల్‌లో ఏ జట్టుతో ఏ జట్టు తలపడనుందో డిసైడ్ చేసింది. చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ స్పాట్‌కు చేరింది. మొత్తం 9 లీగ్‌ మ్యాచ్‌లు ఆడి ఏడింటిలో విజయం సాధించి.. ఓ మ్యాచ్‌ ఓడిపోయి.. మరో మ్యాచ్‌ వర్షంతో ఆగిపోవడంతో 15 పాయింట్లు సాధించింది భారత జట్టు. ఇక న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌లో తలపడనుంది. మరోవైపు మెగా టోర్నీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైన ఆస్ట్రేలియా... 14  పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. టాప్‌స్పాట్‌లో ఉన్న కోహ్లీసేన.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ఢీకొట్టనుండగా... రెండో స్థానంలో ఉన్న ఆసీస్ జట్టు... మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో తలపనడుంది. ఇక, మంగళవారం టీమిండియా-న్యూజిలాండ్‌తో ఫస్ట్ సెమీ ఫైనల్ ఆడనుండగా... ఆసీస్-ఇంగ్లండ్ మధ్య గురువారం సెకండ్ సెమీస్‌ జరగనుంది.