టీమిండియా, కివీస్ మ్యాచ్ రద్దు

టీమిండియా, కివీస్ మ్యాచ్ రద్దు

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ లో గురువారం జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో టాస్ వేయకుండానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 ని.లకు టాస్‌ వేయాల్సి ఉన్నప్పటికీ ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటం చేత ఆటకు అంతరాయ ఏర్పడింది. అయితే తొలుత కాస్త వర్షం ఆగడంతో టాస్‌ను 3గం.లకు వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ క్రమంలోనే పిచ్‌పై కవర్లు తొలగించారు. కాగా, మళ్లీ వర్షం కురవడం ప్రారంభం కావడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. 5గంటలకు అంపైర్లు పిచ్ ను పరిశీలించారు. మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది.