భారత్, కీవిస్ మ్యాచ్ కు వర్షం ఆటంకం

భారత్, కీవిస్ మ్యాచ్ కు వర్షం ఆటంకం

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. నాటింగ్ హామ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. ఉదయం నుంచి అక్కడ భారీ వర్షం కురిసింది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 ని.లకు టాస్‌ వేయాల్సి ఉన్నప్పటికీ ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటం చేత ఆటకు అంతరాయ ఏర్పడింది. అయితే తొలుత కాస్త తెరుపు  ఇవ్వడంతో టాస్‌ను 3గం.లకు వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ క్రమంలోనే పిచ్‌పై కవర్లు తొలగించారు. కాగా, మళ్లీ వర్షం కురవడం ప్రారంభం కావడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. 5గంటలకు అంపైర్లు పిచ్ ను పరిశీలించనున్నారు. ఈ మెగాటోర్నీలో ఇప్పుడు తలపడబోయే రెండు జట్లూ ఇంతవరకు ఓటమి పాలు కాలేదు. న్యూజిలాండ్ హ్యాట్రిక్‌ కొట్టి జోరు మీదుంది. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా హ్యాట్రిక్‌ కోసం తహతహలాడుతోంది.