వార్మప్ మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా

వార్మప్ మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా

వరల్డ్ కప్ లో భాగంగా ఓవల్ వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. 39.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. కివీస్ పేస్ అటాక్ కు కోహ్లీ సేన పెవిలియన్ బాట పట్టింది. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య(30; 37 బంతుల్లో 6ఫోర్లు), రవీంద్ర జడేజా(54; 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) ఆదుకోవడంతో ఆ మాత్రమైనా స్కోర్‌ సాధించింది. మిగతా బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ(18), ధోనీ(17), కుల్‌దీప్‌ యాదవ్‌(19) కుదురుకొనేందుకు ప్రయత్నించినా న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ట్రెంట్‌ బౌల్ట్(4/33)‌, నీషమ్‌(3/26) ధాటికి.. 39.2 ఓవర్లలో 179 పరుగులకే టీమిండియా కుప్పకూలింది.