భారత బౌలర్ల ధాటికి కివీస్‌ బెంబేలు

భారత బౌలర్ల ధాటికి కివీస్‌ బెంబేలు

ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో కివీస్ బ్యాటింగ్ స్లోగా సాగుతోంది.12 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 1 వికెట్ నష్టానికి కేవలం 38 పరుగులే చేసింది. హెన్రీ నికోల్స్‌ 15,  కేన్ విలియమ్సన్‌ 20 పరుగులుతో క్రిజ్‌లో ఉన్నారు. తొలి బంతి నుంచే మన బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. స్వింగ్‌కు పేస్‌ జోడించి కివీస్‌ బ్యాట్సమన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 14 బంతులు ఆడి ఒక్క పరుగు చేసిన ఓపెనర్ గప్టిల్.. బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యడు. మరో వికెట్‌ పడకుండా నికోల్స్‌, విలియమ్సన్‌ నెమ్మదిగా ఆడుతున్నారు.