ఇండియా వెర్సెస్ కివీస్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా 

ఇండియా వెర్సెస్ కివీస్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా 

ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్నది.  మొదటి వన్డేలో టీం ఇండియా భారీ స్కోర్ సాధించినప్పటికీ కివీస్ జట్టు ఆ స్కోర్ ను ఛేదించి మొదటి వన్డేలో విజయం సాధించింది.  దీంతో మూడు వన్డే సీరీస్ లో కివీస్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉన్నది.  ఈరోజు మ్యాచ్ లో టీం ఇండియా ఎట్టి పరిస్థితిల్లో కూడా గెలవాల్సి ఉంటుంది.  ఈరోజు గెలిస్తే సమం అవుతుంది.  నిర్ణయాత్మక మూడో వన్డేలో ఎవరు గెలిస్తే వారిదే విజయం అవుతుంది.  

కాగా, ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా బౌలింగ్ ఎంచుకున్నది.  న్యూజిలాండ్ ను తక్కువ స్కోర్ కు ఔట్ చేసి లక్ష్యాన్ని ఛేదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.  హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో విజేత ఎవరు అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.  ఇక ఫైనల్ జట్ల వివరాలు ఇలా ఉన్నాయి 

టీం ఇండియా : 

మయాంక్‌, పృథ్వీ షా, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, మనీశ్‌, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, చాహల్‌, నవదీప్‌ సైని, బుమ్రా 

న్యూజిలాండ్ : 

గప్తిల్‌, నికోల్స్‌, బ్లండెల్‌, టేలర్‌, లేథమ్‌, గ్రాండ్‌హోమ్‌, నీషమ్‌, బెనెట్‌, సౌథీ, జేమిసన్‌, మార్క్‌ చాప్‌మన్‌