కివీస్‌తో టీమిండియా కీలక పోరుకు రెడీ.. 

కివీస్‌తో టీమిండియా కీలక పోరుకు రెడీ.. 

వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా రెడీ అయింది. ఇప్పటిక వరకూ ఈ టోర్నీలో ఓటమి రూచి చూడని ఈ రెండు జట్లు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైన ధావన్‌ స్థానంలో ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేయబోతున్నాడు. రాహుల్‌ ఓపెనింగ్‌ చేయనుండడంతో నాలుగో స్థానంలో ఎవరు ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ లేదా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ఇక.. కోహ్లి, ధోని, హార్దిక్‌లు సూపర్‌ ఫామ్‌లో ఉండడం భారత్‌కు ప్లస్‌ పాయింట్‌. మరోవైపు కివీస్‌ జట్టులో గప్తిల్‌, మన్రో, విలియమ్సన్‌, టేలర్‌, లేథమ్‌, నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌లతో బ్యాటింగ్‌ బలంగా ఉంది. బౌల్ట్‌, హెన్రీ, ఫెర్గూసన్‌ లాంటి బౌలర్లు ఈ జట్టుకు ప్రధాన బలం. ఇరు జట్లకూ కీలకమైన ఈ మ్యాచ్‌కూ వాన ముప్పు పొంచి ఉండడం అభిమానులను కలవరపెడుతోంది.