వరుణుడు కరుణినిస్తాడా.. కొంప ముంచుతాడా ?

వరుణుడు కరుణినిస్తాడా.. కొంప ముంచుతాడా ?

సాధారణంగా మ్యాచ్ రోజున వర్షం కురిసి ఆగిపోతే డక్ వర్త్ లూయిస్ నియమ ప్రకారం ఓవర్లను కుదించి ఆటను కొనసాగిస్తారు.  కానీ నిన్న ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ ఆటలో వరుఁడు ప్రతాపాన్ని చూపాడు.  ఫలితంగా అటు రిజర్వ్ డేకు షిఫ్ట్ అయింది.  అంటే ఈరోజు నిన్న 46.1 ఓవర్ల వద్ద ఆగిన మ్యాచ్ మళ్ళీ అదే 46.1 ఓవర్ల నుండి మొదలవుతుంది.  

ఒకవేళ మళ్ళీ వర్షం మొదలై ఆడకుండా పడితే ఎక్కువ పాయింట్స్ ఉన్నవారిని  ఫైనల్‌కు పంపుతారు.  అంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న భారత్ జట్టు  ఫైనల్‌కు వెళుతుంది.  అలా కాకుండా వర్షం పడకపోతే న్యూజిలాండ్ 50 ఓవర్లు ఆడి నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది.  ఇది తడిసిన పిచ్, అవుట్ ఫీల్డ్, గాలిలో తేమ ఎక్కువవడం వంటి కారణాల చేత కొంచెం కష్టం కావొచ్చు కానీ పోరాడితే గెలుపు ఖాయం. 

ఈ రెండు పరిస్థితులు కాకుండా వర్షం కాసేపు పడి ఆగిపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి అవలంబించాల్సి ఉంటుంది.  అంటే ఇండియా తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది.  ఉదాహరణకి 46 ఓవర్లు ఇస్తే లక్ష్యం 237 పరుగులు, 40  ఓవర్లు ఇస్తే  223 పరుగులు, 35 ఓవర్లు ఇస్తే 209 పరుగు, 30 ఓవర్లు ఇస్తే 192 పరుగులు,  25 ఓవర్లు ఇస్తే 172 పరుగు చేయాల్సి ఉంటుంది.  ఇది తడిసిన పిచ్, అవుట్ ఫీల్డ్, ధీటైన న్యూజిలాండ్ బౌలింగ్ ముందు చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం.  మరి చూడాలి వరుణుడు కరుణిస్తాడో.. కొంప ముంచుతాడో.