వరల్డ్‌కప్‌ సెమీస్‌: టాస్‌ గెలిచిన కివీస్‌

వరల్డ్‌కప్‌ సెమీస్‌: టాస్‌ గెలిచిన కివీస్‌

వరల్డ్‌కప్‌లో ఇవాళ కీలక పోరు మరికొద్ది సేపట్లో ప్రారంభంకాబోతోంది. లీగ్‌ దశలో సంచలన విజయాలు నమోదు చేసిన ఇండియా, న్యూజిలాండ్‌లు ఇవాళ సెమీఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కుల్దీప్‌ యాదవ్‌ స్థానంతో చాహల్‌కు చోటిచ్చింది టీమ్‌ మేనేజ్‌మెంట్. ఇక.. న్యూజిలాండ్‌ జట్టులో ఫెర్గుసన్‌ కు ఛాన్స్‌ దక్కింది.