వర్షం తగ్గకపోతే సెమీస్‌లో విజేత ఎవరు..?

వర్షం తగ్గకపోతే సెమీస్‌లో విజేత ఎవరు..?

మాంచెస్టర్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. 47వ ఓవర్‌ మొదటి బాల్‌ పూర్తయిన వెంటనే వర్షం రావడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. ఒకవేళ ఇవాళ కాసేపు ఆగాక వర్షం తగ్గితే టీమిండియాను 20 ఓవర్లైనా ఆడించే అవకాశం ఉంటుంది. అలా జరిగిన పక్షంలో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత్‌కు టార్గెట్‌ సెట్‌ చేస్తారు. ఒకవేళ ఇవాళ వర్షం తగ్గకపోయినా లేదా తగ్గినా ఆటకు గ్రౌండ్‌ సహకరించకపోయినా రేపు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఇవాళ ఎక్కడ నుంచి ఆగిందో అక్కడి నుంచి మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. అంటే.. 47.2వ బాల్‌ నుంచి మ్యాచ్‌ మొదలవుతుంది. రేపు కూడా వర్షం వల్ల మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేకపోతే లీగ్‌ పాయింట్ల పట్టికలో ఎక్కువ పాయింట్లతో ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుతుంది. అలా జరిగితే లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లతో ఉన్న టీమిండియా ఫైనల్‌ చేరుకుంటుంది.