భారీ స్కోరు దిశగా టీమిండియా..

భారీ స్కోరు దిశగా టీమిండియా..

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్-ధవన్‌ 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐతే.. ధవన్‌ (66), రోహిత్ (87) నాలుగు ఓవర్ల తేడాతో వెనుదిరిగారు. వన్‌ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సొగసైన బౌండరీలతో అలరించాడు. కోహ్లీ(43)ని బోల్ట్ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం క్రీజులో రాయుడు(46), ధోనీ(16) ఉన్నారు. 45 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది.