రోహిత్ శర్మ సెంచరీ బాదాడు...

రోహిత్ శర్మ సెంచరీ బాదాడు...

టీమిండియా ఓపెనర్ పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి రోహిత్ తనదైన శైలిలో పాక్ బౌలర్లపై విరుచుపడ్డాడు. 85బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్ల సహాయంతో ప్రపంచ కప్ లో మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అతడికి చక్కటి సహకారం అందించాడు. 57 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రియాజ్ బౌలింగ్ లో బాబర్ ఆజమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొదటి వికెట్ కు ఇద్దరు కలిసి 136 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం 31 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజ్ లో రోహిత్ శర్మ( 102; 87 బంతుల్లో, 9 ఫోర్లు, 3 సిక్సులు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (16; 21  బంతుల్లో  1ఫోరు) ఉన్నారు.