టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా, పాకిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. గాయపడ్డ శిఖర్ ధావన్ స్థానంలో రోహిత్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనుండగా.. నాలుగో స్థానానికి ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు విరాట్ చెప్పాడు. 

ఈమ్యాచ్ లో వరుణుడు కరుణిస్తాడో లేదో స్పష్టంగా తెలియడం లేదు. ప్రస్తుతానికైతే అక్కడ వర్షం కురవట్లేదు కానీ మ్యాచ్‌ మధ్యలో చిరుజల్లులు పడే అవకాశముందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారాన్ని పలు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.

భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా

పాకిస్థాన్ జట్టు: ఇమామ్ హుల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, వాహబ్ రియాజ్, మహ్మద్ ఆమిర్