పాకిస్థాన్ టార్గెట్ః 337

పాకిస్థాన్ టార్గెట్ః 337

ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(140; 113 బంతుల్లో, 14 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ నమోదు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి రోహిత్ తనదైన శైలిలో పాక్ బౌలర్లపై విరుచుపడ్డాడు. 85బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్ల సహాయంతో ప్రపంచ కప్ లో మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (57; 78 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించి రోహిత్ కు చక్కటి సహకారం అందించాడు. మొదటి వికెట్ కు ఇద్దరు కలిసి 136 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ(77; 65 బంతుల్లో, 7 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ధోనీ(1; 2 బంతుల్లో) ఈ మ్యాచ్ లో అభిమానులను నిరాశ పరిచారు. హర్థీక్ పాండ్య(26; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. విజయ్ శంకర్ (15; 15 బంతుల్లో, 1 ఫోరు), కేదార్ జాదవ్(9; 8 బంతుల్లో, 1 ఫోరు) నాటౌట్ గా నిలిచారు. 46.4 ఓవర్ల వద్ద కాసేపు చిరుజల్లులు రావడంతో అంపైర్లు ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు.