దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ

దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ

ప్రపంచకప్ లో భాగంగా మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. మొదటి నుంచి తన సహజ సిద్ధమైన బ్యాటింగ్‌తో రోహిత్‌ ఆడుతుండగా, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అతడికి చక్కటి సహకారం అందించాడు. 57 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రియాజ్ బౌలింగ్ లో బాబర్ ఆజమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొదటి వికెట్ కు ఇద్దరు కలిసి 136 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజ్ లో రోహిత్ శర్మ(75; 85 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0; 1 బంతుల్లో) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో  టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, రాహుల్‌లు ఆరంభించారు.