పీకల్లోతు కష్టాల్లో పాకిస్థాన్

పీకల్లోతు కష్టాల్లో పాకిస్థాన్

టీమిండియా నిర్దేశించిన భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్ కష్టాలు పడుతోంది. 27 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. 4.5 ఓవర్ వద్ద విజయ్ శంకర్ వేసిన బంతికి ప్రమాదకర ఆటగాడు ఇమాముల్ హక్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజంతో కలిసి ఫకర్ జమాన్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు.  ఇద్దరూ క్రీజులో కుదురుకుని ప్రమాదకరంగా మారుపోయారు. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. భారత్‌కు ప్రమాదకరంగా మారిన ఫకర్ జమాన్-బాబర్ ఆజం భాగస్వామ్యాన్ని విడదీశాడు. మహ్మద్ హఫీజ్ 9 పరుగుల వద్ద పాండ్య బౌలింగ్ లో విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. షోయబ్ మాలిక్ ను పాండ్య బౌల్డ్ చేశాడు.