గుడ్‌ న్యూస్‌.. మాంచెస్టర్‌లో వర్షం ఆగింది!

గుడ్‌ న్యూస్‌.. మాంచెస్టర్‌లో వర్షం ఆగింది!

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే భారత్‌, పాక్‌ మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ ఆసక్తికర మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నా.. గత రెండు గంటలుగా ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్‌లో వర్షం కురవకపోవడం గమనార్హం. ప్రస్తుతానికైతే వర్షం కురవకపోయినా దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. సరిగ్గా మ్యాచ్‌  సమయానికి వర్షం జోరందుకునే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక.. మైదానం ఔట్‌ ఫీల్డ్‌లో అక్కడక్కడా తడిగా ఉండడంతో మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇరు జట్లూ మైదానానికి చేరుకున్నాయి.