పాక్ పై టీమిండియా సరికొత్త రికార్డు

పాక్ పై టీమిండియా సరికొత్త రికార్డు

ప్రపంచకప్ లో భాగంగా మాంచెస్టర్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పై అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని భారత్ సాధించింది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. గతంలో పాక్‌పై ప్రపంచకప్ లో భారత్‌ అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం 90( సచిన్, సిద్దూ ) కాగా, దాన్ని తాజాగా రోహిత్‌-రాహుల్‌లు ఆ రికార్డును బద్దలు కొట్టారు.