టీ-20: సౌతాఫ్రికా పెట్టిన టార్గెట్ ఇదే..

టీ-20: సౌతాఫ్రికా పెట్టిన టార్గెట్ ఇదే..

మొహాలీ వేదికగా జరుగుతోన్న రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ముందు 150 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది సౌతాఫ్రికా... ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. డీకాక్ 52 పరుగులతో ఆకట్టుకోగా.. బావుమా 49లతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయకుండా మన బౌలర్లు కట్టడి చేశారు.. భారత బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. నవదీప్ సైనీ, జడేజా, హార్ధిక్ పాండ్యా తలో వికెట్ తీసి.. దక్షిణాఫ్రికాను కట్టడిచేశారు.