టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా


ఇవాళ భారత్ - సౌతాఫ్రికా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ మొదలయింది. ఝార్ఖండ్‌లోని రాంచీ క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే 2 మ్యాచ్‌లు గెలిచిన కోహ్లీసేన.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఒక్క టెస్ట్‌లో నైనా గెలిచి పరువు దక్కించుకోవాలని సఫారీలు కసిమీద ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఈ టెస్టులోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలనే ఆలోచనతో బరిలోకి దిగుతోంది.

మరోవైపు దక్షిణాఫ్రికా ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా కనిపిస్తోంది. కాగా టీమిండియా చైనామన్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ గాయం కారణంగా అతడికి బదులు నదీమ్‌ను ఈ మ్యాచ్‌లో ఆడిస్తున్నారు. అతడికి ఇదే తొలి టెస్టు కావడం విశేషం. పిచ్ పొడిగా ఉంటూ తొలుత బ్యాటింగ్‌కు సహకరించినా క్రమంగా స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసి టాప్‌ ప్లేస్‌ను దక్కించుకోవడం కోహ్లీకి పెద్ద కష్టమేమీ కాదంటున్నారు అభిమానులు. టెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా టాప్‌ ప్లేస్‌లో ఉన్న ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్‌ స్మిత్‌కు, కోహ్లీకి మధ్య ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది.