టాప్‌ స్పాట్‌పై టీమిండియా గురి..

టాప్‌ స్పాట్‌పై టీమిండియా గురి..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో టాప్ స్పాట్‌పై టీమిండియా గురి పెట్టింది... ఇప్పటికే ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న కోహ్లీ సేన.. ఈ మ్యాచ్‌లో గెలస్తే.. మరో రెండు పాయింట్లతో 14 పాయింట్లతో టాప్‌లోఉన్న ఆసీస్‌ను బీట్ చేస్తోంది. ఇప్పటికే వరల్డ్ కప్ సెమీకు చేరిన టీమిండియా.. ఆఖరి లీగ్‌ సమరానికి సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో తలపడనుంది. మరోవైపు వరల్డ్ కప్‌లో లీగ్ దశ ఇవాళ్టితో ముగియనున్నాయి... భారత్ - శ్రీలంక మధ్య ఓ మ్యాచ్ జరగనుండగా... 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇవాళ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇవాళ భారత్ గెలవడం.. ఆసీస్ జట్టు ఓడిపోవడం జరిగితేనే టీమిండియా టాప్ స్పాట్ చేరుకుంటుంది. ఇక పాయింట్ల పట్టికలో తొలిస్థానానికి చేరుకుంటే టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుండగా... రెండో స్థానంలోనే కొనసాగితే మాత్రం ఇంగ్లాండ్‌తో సెమీస్ ఫైట్ ఉంటుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు భారత్-శ్రీలంక మ్యాచ్ ప్రారంభం కానుండగా... సాయంత్రం 6 గంటలకు ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.