టీమిండియా సూపర్‌ విక్టరీ

టీమిండియా సూపర్‌ విక్టరీ

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా అదే జోరును కొనసాగిస్తోంది. ఇవాళ జరిగిన వరల్డ్‌కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. శ్రీలంక ఇచ్చిన 265 పరుగుల టార్గెట్‌ను 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(103: 94 బంతుల్లో.. 14 ఫోర్లు, 2 సిక్సర్లు)తోపాటు కేఎల్‌ రాహుల్‌(111: 118 బంతుల్లో.. 11 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీలు చేశారు. 
అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు చేసింది. మాథ్యూస్‌ (113: 128 బంతుల్లో.. 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్‌ సెంచరీ చేశాడు. తిరుమానె 53 పరుగులు చేశాడు.  భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. పాండ్యా, కుల్దీప్‌, జడేజా, భువనేశ్వర్‌లు చెరో వికెట్‌ తీశారు.