టీ-20 సిరీస్ క్లీన్‌స్వీప్.. ఇక వన్డే సిరీస్‌పై గురి..

టీ-20 సిరీస్ క్లీన్‌స్వీప్.. ఇక వన్డే సిరీస్‌పై గురి..

వెస్టిండీస్‌ పర్యటనలో తొలుత టీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంగా ఉన్న టీమిండియా... ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టిసారించింది... మూడు మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళే తొలి వన్డేలో కరీబియన్‌ జట్టుతో తలపడనుంది. క్రిస్‌ గేల్‌ లాంటి స్టార్ ఆటగాళ్లతో పాటు సీనియర్‌ ఆటగాళ్ల చేరికతో బలోపేతమైన వెస్టిండీస్‌ జట్టును మొదటి వన్డేలో ఢీకొనేందుకు సై అంటోంది. ఐసీసీ వరల్డ్‌ కప్ ఆరంభంలోనే గాయపడి టోర్నీ మొత్తానికి దూరమైన ఓపెనర్‌ ధవన్‌ తిరిగి అందుబాటులోకి వచ్చాడు.. హిట్టర్ రోహిత్‌ శర్మతో కలిసి ధవన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు. ఇక, ప్రపంచకప్‌ సెమీస్‌ పరాజయంతో వన్డేల్లో విరాట్‌ కెప్టెన్సీపై మాజీ ఆటగాళ్లు ప్రశ్నలు లేవనెత్తారు. దాంతో బ్యాట్‌తో మెరవడంతోపాటు మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సిరీస్‌ గెలుచుకోవడం ఇప్పుడు కోహ్లీ ముందున్న సవాళ్లు. గయానా వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

భారత జట్టు అంచనా: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, మనీష్‌ పాండే/శ్రేయాస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, షమి, నవ్‌దీప్‌ సైనీ, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌.
వెస్టిండీస్‌ జట్టు అంచనా: జాసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌/జాన్‌ క్యాంప్‌బెల్‌, షాయ్‌ హోప్‌ (కీపర్‌), హెట్‌మయెర్‌, పూరన్‌, రోస్టన్‌ చేజ్‌, ఫాబియన్‌ అలెన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, కీమో పాల్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ఒషానె థాంప్సన్‌, కీమర్‌ రోచ్‌.