భారీ ఆధిక్యం దిశగా ఇండియా.. ఒత్తిడిలో వెస్ట్ ఇండీస్

భారీ ఆధిక్యం దిశగా ఇండియా.. ఒత్తిడిలో వెస్ట్ ఇండీస్

ఇండియా వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఆంటిగ్వాలో జరుగుతున్నది.  మూడో రోజు అట ముగిసే సమయానికి ఇండియా జట్టు 72 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.  విరాట్ కోహ్లీ 51 పరుగులతోను, అజింక్యా రహానె 53 పరుగులతోను క్రీజ్ లో ఉన్నారు.  ఇంకా ఇండియా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.   ప్రస్తుతానికి ఇండియా 260 పరుగుల భారీ ఆధిక్యంలో ఉన్నది. ఓపెనర్లు మయాంక్, కెఎల్ రాహుల్ లు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అటు పూజారా కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.  అయితే, ఒకదశలో రాహుల్, పూజారులు కుదురుకున్నట్టుగానే కనిపించినా.. ఛేజ్ బౌలింగ్ లో రాహుల్ బౌల్డ్ కావడంతో స్కోర్ మందగించింది.  మరికాసేపటికే  పుజారా కూడా ఔట్ కావడం  విశేషం.  

పూజారా ఔట్ అయ్యే సమయానికి ఇండియా స్కోర్ 81/3గా ఉన్నది.  అయితే, కోహ్లీ, రహానె జోడి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.  క్రీజ్ లో స్టాండ్ అవుతూ.. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ పరుగులు రాబట్టుకున్నారు.  మ్యాచ్ 68 ఓవర్లో రహానె 50 పరుగులు పూర్తి చేసుకోగా, కోహ్లీ 71వ ఓవర్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.  వెలుతురూ సరిగా లేకపోవడంతో ఆట సమయం కంటే ముందుగానే ముగిసింది.