మరో క్లీన్‌స్వీప్‌పై గురి...

మరో క్లీన్‌స్వీప్‌పై గురి...

వెస్టిండీస్ పర్యటనలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు వన్డే కప్‌పై కన్నేసింది. తొలి వన్డేను వరుణుడు అడ్డుకోవడంతో మ్యాచ్ రద్దు కాగా.. రెండో వన్డేలో గ్రాండ్ విక్టరీ కొట్టింది కోహ్లీ సేన. దీంతో సిరీస్ 1-0 అధిక్యంలోకి వచ్చిన భారత్.. ఇక ఇవాళ జరగనున్న మూడో వన్డేలో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌ గెలిచి 2-0తో వన్డే సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు వరుస ఓటములతో వెనుకబడిపోయిన విండీస్‌ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి 1-1తో సిరీస్‌ను సమం చేయాలనుకుంటోంది. ఇక, గాయం కారణంగా వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగిన శిఖర్ ధావన్ ఈ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.. దీంతో చివరి వన్డేలో ధావన్ పై మరింత ఒత్తిడి ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మరోవైపు ఫైనల్ వన్డేకు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

టీమిండియా జట్టు అంచనా: శిఖర్ ధావన్, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రిషబ్ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, కేదార్ జాదవ్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్, మహ్మద్ షమి/సైనీ, కుల్దీప్‌ నాయర్ /చాహల్‌, ఖలీల్‌.
వెస్టిండీస్‌ జట్టు అంచనా: క్రిస్ గేల్‌, లూయిస్‌, హోప్‌, హెట్‌మయెర్‌, పూరన్‌, చేజ్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), బ్రాత్‌వైట్‌, పాల్‌, రోచ్‌, కాట్రెల్‌.