సీరీస్ అప్పగిస్తారా... సమం చేస్తారా? 

సీరీస్ అప్పగిస్తారా... సమం చేస్తారా? 

ఇండియా... వెస్ట్ ఇండీస్ జట్లమధ్య టి 20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు టి 20 సీరీస్ లో ఇప్పటికే ఇండియా తొలి మ్యాచ్ విజయం సాధించింది.  రెండో టి 20 మ్యాచ్ తిరువనంతపురంలో జరుగుతున్నది.  ఎలాగైనా గెలిచి సీరీస్ ను సమం చేయాలని విండీస్ చూస్తుంటే.. గెలిచి సీరీస్ ను ఎగరేసుకుపోవాలని ఇండియా చూస్తున్నది. 

ప్రస్తుతం ఫస్ట్ టి 20 మ్యాచ్ లో టీం ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ ను చేజ్ చేసింది.  దీంతో వెస్ట్ ఇండీస్ ఇప్పుడు టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది.  ఇండియాను వీలైనంత తక్కువ స్కోర్ కు కట్టడి చేసి.. టార్గెట్ ఛేజ్ చేయాలని చూస్తున్నది విండీస్.  మరి విండీస్ కల నెరవేరుతుందా చూద్దాం.