నేడే రెండో టీ-20... సిరీస్‌పై గురి...

నేడే రెండో టీ-20... సిరీస్‌పై గురి...

మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్‌పై దృష్టిపెట్టింది.. ఇవాళ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో రెండో టీ-20లో విక్టరీ కొట్టి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది కోహ్లీసేన. మరోవైపు ఉప్పల్‌ మ్యాచ్‌లో 94 పరుగులతో ఉచకోత కోసిన కోహ్లీ... ఇప్పటివరకు టీ-20ల్లో 2544 పరుగులు చేశాడు.. మరో 3 పరుగులు చేస్తే రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు. దీని కోసం ఈ మ్యాచ్‌లో రోహిత్ కంటే ఎక్కువ పరుగులు చేయాల్సిఉంటుంది కోహ్లీ. 

ఇక రెండు జట్ల ఆటగాళ్లను పరిశీలిస్తే... విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, శ్రేయాస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్, చాహల్‌, దీపక్‌ చాహర్‌తో టీమిండియా బరిలోకి దిగనుండగా.. పొలార్డ్‌ (కెప్టెన్‌), సిమ్మన్స్‌, లూయిస్‌, హెట్‌మయెర్‌, బ్రాండన్‌ కింగ్‌, పూరన్‌, హోల్డర్‌, పియెర్‌, కాట్రెల్‌, హేడెన్‌ వాల్ష్‌, విలియమ్స్‌తో వెస్టిండీస్‌ రెండో మ్యాచ్ ఆడనుంది.