సెహ్వాగ్‌ రికార్డు బ్రేక్‌...

సెహ్వాగ్‌ రికార్డు బ్రేక్‌...

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెహ్వాగ్‌ రికార్డును బ్రేక్‌ చేసాడు. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ బౌలర్ దేవేంద్ర  బిషూ బౌలింగ్ లో ఫోర్‌ కొట్టి కోహ్లీ సెంచరీ సాధించాడు. 184 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 101 పరుగులు చేసాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 24 వ సెంచరీ. దీంతో అత్యధిక టెస్ట్‌ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లి.. వీరేంద్ర సెహ్వాగ్‌ రికార్డును బ్రేక్‌ చేసాడు. ఈ జాబితాలో సచిన్( 51) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్‌ (36), సునీల్‌ గవాస్కర్‌ (34)లు ఉన్నారు. విరాట్  కోహ్లి(24), సెహ్వాగ్(23) ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు. 72 టెస్టుల్లో కోహ్లి 24 సెంచరీలు సాధించగా.. 103 టెస్టుల్లో సెహ్వాగ్‌ 23 సెంచరీలు చేశాడు.