హైదరాబాద్‌ టీ-20... భారత్‌ ముందు భారీ లక్ష్యం...

హైదరాబాద్‌ టీ-20... భారత్‌ ముందు భారీ లక్ష్యం...

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది వెస్టిండీస్ జట్టు... భారత్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ బ్యాట్స్‌మెన్ సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలర్లలపై విరుచుకుపడ్డారు. హెట్‌మైర్ 56, ఆఖర్లో హోల్డర్ 24, పొలార్డ్ 37, ఎవిన్ లూయిస్ 40, బ్రాండన్ కింగ్ 31, హోల్డర్ 24 (నాటౌట్), దినేశ్ రాందిన్ 11 (నాటౌట్) ఇలా ఎవరి రేంజ్‌లో వాళ్లు మెరిపించారు.. కరీబియన్ బ్యాటింగ్ లైనప్‌లో అందరూ హిట్టర్లే ఉండటంతో వచ్చిన వారు వచ్చినట్లే బౌండరీల మోత మోగించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి.. టీమిండియా ముందు 208 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.