టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లలో భాగంగా ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో మరికొద్ది సేపట్లో వెస్టిండీస్‌, భారత్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటిసారిగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతుంది. కెప్టెన్ కోహ్లీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. భువి, చాహల్ లు ఫిట్ గా లేకపోవడంతో వారిని జట్టు నుండి తప్పించారు. మరోవైపు విండీస్ జట్టులో ముగ్గురు ఆరంగేట్రం చేశారు.

జట్లు:

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, రిషబ్ పంత్‌ (కీపర్‌), దినేష్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, క్రునాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్, బుమ్రా, ఖలీల్‌, ఉమేష్ యాదవ్.

వెస్టిండీస్‌: రోవ్‌మన్‌ పొవెల్‌, డారెన్‌ బ్రావో, హోప్, హెట్‌మయెర్‌, రామ్‌దిన్‌ (కీపర్‌), పొలార్డ్, బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), కీమో పాల్‌, అలెన్‌, పీయరీ, థామస్.