నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్

నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. విండీస్ పరుగుల ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ ను కోల్పోయింది. ఉమేష్ యాదవ్ ఓపెనర్ క్రైగ్ బ్రాత్వైట్ (0) ను అవుట్ చేసాడు. అనంతరం అశ్విన్ బౌలింగ్ లో రహానే అద్భుత క్యాచ్ అందుకోవడంతో పావెల్ (0) పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో హెట్మయెర్ (17), హోప్ (28)లు జట్టును ఆదుకున్నారు. 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం హెట్మయెర్.. కుల్దీప్ కి చిక్కాడు. ఆ వెంటనే హోప్.. జడేజా బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు.  ప్రస్తుతం విండీస్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజ్ లో సునీల్ అంబ్రీస్ (4), రోస్టన్ చేజ్ (3)లు ఉన్నారు. విండీస్ ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ కి 4  పరుగులు వెనుకపడి ఉంది. టీమిండియా బౌలర్లలో ఉమేష్, అశ్విన్, కుల్దీప్, జడేజా తలో వికెట్ తీశారు.