రెండు వికెట్లు కోల్పోయిన విండీస్

రెండు వికెట్లు కోల్పోయిన విండీస్

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. విండీస్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ క్రైగ్ బ్రాత్వైట్(0) వికెట్ ను కోల్పోయింది. ఉమేష్ యాదవ్ ఇన్నింగ్స్ రెండవ బంతికే బ్రాత్వైట్ ను వెనక్కి పంపాడు. అనంతరం రవిచంద్రన్ అశ్విన్ పావెల్(0)ను అవుట్ చేసాడు. రహానే అద్భుత క్యాచ్ అందుకోవడంతో పావెల్ పెవిలియన్ బాట పట్టాడు. భారత బౌలర్ల దాటికి విండీస్ ఓపెనర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం విండీస్ 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజ్ లో హెట్మయెర్ (4), హోప్(6)లు ఉన్నారు. విండీస్ ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ కి 46 పరుగులు వెనుకపడి ఉంది.