రోహిత్ సెంచరీ...

రోహిత్ సెంచరీ...

వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ సెంచరీ చేసాడు. ఫ్యాబియాన్ అల్లెన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి సెంచరీ మార్క్ ను చేరుకున్నాడు. రోహిత్‌ శర్మ 99 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 100 పరుగులు చేసాడు. వన్డేల్లో రోహిత్ కి ఇది 21 వ సెంచరీ. 2013 జనవరి నుండి రోహిత్ 19 సెంచరీలు చేసాడు. రోహిత్ 186 ఇన్నింగ్స్ లలో 21 సెంచరీలు చేసాడు. 21 సెంచరీలను ఆమ్లా కేవలం 116 ఇన్నింగ్స్ లలో చేసాడు. కోహ్లీ(138), డివిలియర్స్(183) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

శిఖర్‌ ధావన్‌ (38), విరాట్ కోహ్లీ (16) పెవిలియన్ చేరినా అంబటి రాయుడుతో కలిసి రోహిత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 101/2 గా ఉన్న జట్టు స్కోర్ రోహిత్ దాటికి 241/2 గా మారింది. మరోవైపు రాయుడు కూడా రోహిత్ కి చక్కటి సహకారం అందిస్తూ హాఫ్ సెంచరీ చేసాడు. ఈ జోడి ఇప్పటికే 140 పరుగుల బాగస్వామ్యంను నమోదు చేసింది. 38 ఓవర్లు ముగిస సరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (118; 115 బంతుల్లో 15×4, 1×6), అంబటి రాయుడు (64; 57 బంతుల్లో 6×4, 2×6) క్రీజ్ లో ఉన్నారు.