20 వద్ద మూడు వికెట్లు కోల్పోయిన విండీస్

378 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. జట్టు స్కోర్ 20 పరుగుల వద్ద విండీస్ మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ చందర్‌పాల్ హేమ్‌రాజ్ (14) భువనేశ్వర్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి రాయుడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం షాయ్ హోప్ (0) రనౌట్ అయ్యాడు. కుల్దీప్ విసిరిన బంతి నేరుగా వికెట్లను గిరాటేయడంతో హోప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కీరన్ పావెల్ (4) కూడా రనౌట్ అయ్యాడు. ఈ సారి కెప్టెన్ కోహ్లీ చక్కటి త్రోతో పావెల్ ను పెవిలియన్ పంపాడు. 20 పరుగులకే వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో విండీస్ కష్టాల్లో పడింది. భువనేశ్వర్ ఒక వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్ లో శామ్యూల్స్ (12), హెట్మయర్ (11)లు ఉన్నారు. విండీస్ 9 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. విండీస్ విజయం సాధించాలంటే ఇంకా 335 పరుగులు చేయాలి.