మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ కొత్తేమి కాదు

మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ కొత్తేమి కాదు

టీమిండియా గతకొంత కాలంగా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాలుగు, ఐదు స్థానాలపై ఇప్పటికే దాదాపు 7-8 మందిని పరిశీలించింది. అయితే నాలుగవ స్థానంలో రాయుడు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకున్నాడు. మొదటి వన్డేలో కూడా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఈ సిరీస్‌లో కనుక రాయుడు రాణిస్తే ప్రపంచకప్‌ వరకు జట్టులో కొనసాగే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో రెండో వన్డే సందర్భంగా రాయుడు మాట్లాడుతూ... నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఈ సిరీస్‌పైనే దృష్టి పెట్టాను. తర్వాతి పరిణామలపై ఆలోచించడం లేదు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం నాకు కొత్తేమి కాదు. చాలా రోజులు నుంచి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాను. నేను నా ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టాను. యోయో టెస్ట్‌ గురించి కూడా ఆలోచించలేదు. ఇప్పటికి కూడా ఎన్సీఏకి వెళ్తున్నాను. వారంలో కొద్ది సమయం మాత్రం కాళీ సమయం ఉంటుంది. యోయో టెస్ట్‌ క్లియర్ చేసినందుకు సంతోషంగా ఉంది అని రాయుడు తెలిపాడు.

ఐపీఎల్‌కి ముందు నేను కాంటెస్ట్ లో లేను. గాయాలు బాధించాయి. తిరిగి జట్టులోకి రావడానికి ఐపీఎల్‌ నాకు మంచి అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా ఫిట్‌నెస్‌లో నేనేంటో నిరూపించుకునేలా చేసింది. భారత జట్టులో టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణిస్తోంది. మిడిలార్డర్‌లో ఆడటం ఛాలెంజ్‌తో కూడుకున్నది.. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. విండీస్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. కానీ ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌ అద్భుతంగా ఆడారు. వచ్చే మ్యాచ్ లలో వారు మంచి ప్రదర్శనతో మాకు ఛాలెంజ్ విసిరొచ్చు అని రాయుడు తెలిపాడు.