టాస్‌ గెలిచిన భారత్..

టాస్‌ గెలిచిన భారత్..

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌ కప్‌లో భాగంగా కాసేపట్లో బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్-బంగ్లాదేశ్‌ మధ్య కీలక మ్యాచ్‌ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా బ్యాటింగ్‌ చేసేందుకే మొగ్గుచూపాడు భారత కెప్టెన్. ఇక భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు. కేదార్ జాదవ్ స్థానంలో దినేష్ కార్తీక్‌కు అవకాశం ఇవ్వగా... కుల్దీప్ స్థానంలో భువనేశ్వర్‌ కుమార్ బరిలోకి దిగనున్నాడు. భారత్‌ ఈ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ సెమీస్‌కు చేరుకోనుండగా... బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది.