అక్రమ వలసదారుల్ని కాల్చేస్తే స‌రి

అక్రమ వలసదారుల్ని కాల్చేస్తే స‌రి

వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైనా హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి తన స్వభావాన్ని బయటపెట్టారు. అసోంలోని అక్రమ వలసదారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు గౌరవంగా దేశం విడిచిపోవాలన్నారు. లేకపోతే.. వారిని కాల్చేస్తేనే దేశం క్షేమంగా ఉంటుందని రాజాసింగ్ పేర్కొన్నారు. అసోంలో నివసిస్తున్న వారిలో 40 లక్షల మంది ఈ దేశ పౌరులు కారని ఎన్నార్సీ తేల్చింది. దీనిపై రాజా సింగ్ పైవిధంగా స్పందించారు. ఎన్నార్సీ ముసాయిదాను సుప్రీం కోర్ట్ మానిటరింగ్ చేసిందని గుర్తు చేశారు. 3.29 కోట్ల అసోంలో రాష్ట్ర జనాభాలో 2.89 కోట్లమంది మాత్రమే భారత పౌరులని ఎన్నార్సీ  వెల్లడించిందని రాజాసింగ్ గుర్తు చేశారు.  ఎన్నార్సీని రాజకీయం చేయవద్దని .... దాన్ని ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకోకూడదని గతంలో రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కూడా గుర్తు చేశారు. ఇది మానవ హక్కులకు సంబంధించిన అంశమనీ... హిందూ , ముస్లీంల ఇష్యూ కాదని ఆయన గతంలో చెప్పారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించకుండా రాజాసింగ్ లాంటి నేతలు నోరు జారుతుంటే ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.