ఆ నీళ్లు ఇకపై ఇండియాకే సొంతం..

ఆ నీళ్లు ఇకపై ఇండియాకే సొంతం..

1947 లో ఇండియా.. పాక్ విభజన సమయంలో హిమాలయాల నుంచి ఇండియా మీదుగా పాక్ లోని సింధు, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు ప్రవహిస్తుంటాయి.  ఇందులో సింధు, జీలం, చినాబ్ నదులను పాక్ వినియోగించుకుంటే, రావి, బియాస్, సట్లెజ్ నదులను ఇండియా వినియోగించుకోవాలి.  ఈ మూడు నదులు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది.  ఈ నదులు ఈ రాష్ట్రాల మీదుగా ప్రవహించి పాక్ లోకి వెళ్తున్నాయి.  

అయితే, గతంలోని ప్రభుత్వాలు ఈ నదుల నీళ్లకు అడ్డుకట్ట వేసి, సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి కావలసిన చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యాయి... ఇకపై రావి, సట్లెజ్, బియాస్ నదులకు సంబంధించిన నీళ్లను ఇండియానే సమర్ధవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు.  ఈ నదులపై ఆనకట్టలు నిర్మించి ఈ నీళ్లను మనమే వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు.  ఈ నీళ్లను నిలువ చేసుకోగలిగితే.. ఈ రెండు రాష్ట్రాలతో పాటు పొగురున పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలకు కూడా నీటి సమస్యలు తీరిపోతాయి.