రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం

రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం

పుణె టెస్ట్‌లో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌ లో 137 పరుగులతో తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. క్రికెట్‌ హిస్టరీలో ఫాలో ఆన్‌ ఆడి ప్రొటీస్‌ టీమ్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి. స్వదేశంలో వరుసగా 11వ సిరీస్‌ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ విజయంతో టీమిండియా ఫ్రీడం సిరీస్‌ ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో తన ఖాతాలో వేసుకున్నట్టయ్యింది.

రెండో ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆలౌటైన సఫారీని ఫాలో ఆన్‌ ఆడించాడు కోహ్లీ. ఫాలో ఆన్‌తో బరిలోకి దిగిన సఫారీకి మరోసారి చుక్కలు చూపించారు టీమిండియా బౌలర్లు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేసి సౌతాఫ్రికాను 189 పరుగులకే ఆలౌట్‌ చేసింది. టీమిండియా బౌలర్లలో జడేజా, ఉమేశ్‌ చెరో మూడు వికెట్లు తీశారు. అశ్విన్‌ రెండు వికెట్లతో సత్తా చాటాడు. సఫారీ టీమ్‌లో ఎల్గర్‌ 48 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.  

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా బ్యాటింగ్‌లో రెచ్చిపోయింది. కోహ్లీ 2వందల 54 పరుగులతో చెలరేగాడు. మయాంక్‌ సెంచరీతో రాణించగా పుజారా, రహనే, జడేజా హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు. బ్యాట్స్‌మన్‌ సమిష్టిగా రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 6వందల ఒక పరుగు వద్ద ఇన్నింగ్స్‌ని డిక్లేర్‌ చేసింది టీమిండియా.

కొండంత స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన సఫారీ టీమ్‌కు తమ బౌలింగ్‌తో చెక్‌ పెట్టారు భారత బౌలర్లు. ఇప్పటికే వైజాగ్‌ మ్యాచ్‌లో ఓడిన సఫారీ ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో సిరీస్‌ను భారత్‌కు అప్పగించింది. మూడో టెస్ట్‌ రాంచీలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఇక డబుల్‌ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్‌ కోహ్లీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.