ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం

ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం

ఆక్లాండ్ లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ తొలి టీ20లో భారత్‌ ముందు కివీస్‌ 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, లక్ష్యఛేదనకు బరిలో దిగిన భారత్‌ ధీటుగా బదులిచ్చింది. పదిఓవర్లు దాటక ముందే.. వికెట్‌ నష్టానికి వంద స్కోరును క్రాస్‌ చేసింది.  19 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది భారత్. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ పరుగుల తుఫాన్ కురిపించాడు. దీంతో న్యూజిలాండ్ పై 6వికెట్ల తేడా సునాయాసంగా గెలిచింది.  అయ్యర్ 58, లోకేశ్ రాహుల్ 56, విరాట్ కోహ్లీ 45 పరుగులు చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. మార్టిన్‌ గుప్తిల్‌ 30, కొలిన్‌ మన్రో 59  పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లను ఆటాడుకున్న న్యూజిల్యాండ్ బ్యాట్స్‌మెన్‌ ఆ జట్టుకు 203 పరుగుల భారీ స్కోర్‌ అందించారు. భారత్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, జస్ప్రిట్ బుమ్రా, చాహల్, శివమ్ దూబే, జడేజాలు ఒక్కొక్క వికెట్లు తీశారు.