కరోనా బాధితులకు విరాళం ప్రకటించిన భారత మహిళా క్రికెటర్...

కరోనా బాధితులకు విరాళం ప్రకటించిన భారత మహిళా క్రికెటర్...

ప్రస్తుతం కరోనా పేరు వింటే చాలు ప్రపంచం వణికిపోతుంది. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి సెలబ్రెటీలు, భారత క్రికెటర్స్ అందరూ కరోనా బాధితుల కోసం విరాళాలు ప్రటించారు. అయితే ఇప్పుడు తాజాగా  భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్ కూడా కరోనా బాధితుల సహాయం కొరకు విరాళం అందించింది.  ఈ నెల ప్రారంభంలో మహిళల టి 20 ప్రపంచ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన పదహారేళ్ల ఆల్‌రౌండర్ రిచా ఘోష్ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం కోసం బెంగాల్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ .1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కును అందజేయడానికి రిచా తండ్రి మనబేంద్ర ఘోష్ సిలిగురి జిల్లా మేజిస్ట్రేట్ సుమంతా సహే నివాసానికి వెళ్లారని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తెలిపింది."ప్రతిఒక్కరూ  కరోనా వైరస్ తో పోరాడుతున్నప్పుడు మరియు దానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినప్పుడు, దేశంలోని బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను కొంచెం సహకరించాలని అనుకున్నాను" అని రిచా  తెలిపింది.