భారత మహిళలకు ఆ సత్తా ఉంది... 

భారత మహిళలకు ఆ సత్తా ఉంది... 

భారత మహిళల జట్టుకు ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచే సత్తా ఉంది అని జాతీయ మహిళా జట్టు చీఫ్ సెలెక్టర్ 'హేమలతా కాలా' అన్నారు. ఇప్పటివరకు మహిళల జట్టు అన్ని ఐసీసీ టోర్నీలలో చివరివరకు అద్భుతంగా రాణించి ఫైనల్ లేదా సెమీఫైనల్ లో వెనక్కి వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే ప్రస్తుత పురుషుల జట్టు పరిస్థితి కూడా అదే. ఇక 78 వన్డేలు, ఏడు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన కాలా, 2016 లో ప్యానెల్ చీఫ్ అయ్యే ముందు 2015 లో సెలెక్టర్‌గా నియమితులయ్యారు. మహిళల  జట్టు గురించి ఆవిడా మాట్లాడుతూ... "ఆటగాళ్ళు పెద్ద టోర్నీలు ఆడటానికి సిద్ధంగా ఉండాలి, అయితే వారు యువ ఆటగాళ్ళు కాబట్టి అనుభవం కలిగి ఉన్నవారు జట్టులో ఎక్కువగా లేరు. అంతే కాకుండా బ్యాటింగ్ వైఫల్యం కూడా ఓ సమస్య, ఫైనల్స్ మ్యాచ్లలో వారు  బాగా ఒత్తిడికి లోనవుతారు అని వివరించింది. భారతదేశం 2017 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది, ఇది దేశంలో మహిళల క్రికెట్‌కు ఒక మైలురాయి అని తెలిపింది.