టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్

టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్

ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా మొదటి టీ20 ప్రారంభమయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళా కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు కోమల్, భారతి, అనుజా, ఏక్తాలకు విశ్రాంతిని ఇచ్చింది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో ఇద్దరు క్రీడాకారిణిలు గాయం కారణంగా తప్పుకున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఇదే జోరును కొనసాగిస్తూ వచ్చే ప్రపంచకప్‌నకు జట్టు కూర్పుపై దృష్టిపెట్టింది. వన్డే సిరీస్ పరాజయానికి టీ20 సిరీస్ ద్వారా ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లండ్ సిద్దమయింది.