నేడు ఇంగ్లండ్‌తో చివరి వన్డే

నేడు ఇంగ్లండ్‌తో చివరి వన్డే

ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో గురువారం భారత్, ఇంగ్లండ్‌ మహిళలు తలపడనున్నారు. వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో చివరిదైన మూడో వన్డే జరుగనుంది. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ 2-0తో దక్కించుకున్న భారత మహిళల జట్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి 2021 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించేందుకు మార్గం మరింత సుగమం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు రెండు వరుస ఓటములను ఎదుర్కొన్న ఇంగ్లండ్‌ పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఐసీసీ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచి రెండు పాయింట్లు తమ ఖాతాలో చేర్చుకోవాలని భావిస్తోంది. భారత్ రెండు విభాగంలో పటిష్టంగా ఉండగా.. ఇంగ్లాండ్ మాత్రం తేలిపోతోంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.