ఐదో వన్డేలో కివీస్‌కి షాక్‌

ఐదో వన్డేలో కివీస్‌కి షాక్‌

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలోనూ టీమిండియా గెలిచి మ్యాచ్‌తోపాటు సిరీస్‌నూ చేజిక్కించుకుంది. 253 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 44.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. నీషమ్‌ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో చాహల్‌ 3, పాండ్య, షమీ చెరో 2 వికెట్లు తీశారు. అంతకముందు భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో మరో బంతి మిగిలి ఉండగానే 252 పరుగులకు ఆలౌట్‌ అయింది. అంబటి రాయుడు(90), హార్దిక్‌ పాండ్య(45), విజయ్‌ శంకర్‌(45) పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. మాట్‌ హన్రీ 4 వికెట్లు, ట్రెంట్‌ బౌల్ట్‌ 3 వికెట్లు, జేమ్స్‌ నీషమ్‌ 1 వికెట్‌ తీశారు.