భారత్ చేతిలో ఐర్లాండ్‌ చిత్తు..

భారత్ చేతిలో ఐర్లాండ్‌ చిత్తు..

టీ20ల్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (97: 61 బంతుల్లో 8x4, 5x6), శిఖర్ ధావన్ (74: 45 బంతుల్లో 5x4, 5x6) రాణించారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ 132/9కే పరిమితమైంది. ఓపెనర్ జేమ్స్ (60: 35 బంతుల్లో 5x4, 4x6) మినహా మరెవరూ రాణించలేదు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/21), చాహల్ (3/38) శభాష్‌ అనిపించారు.